మహారాష్ట్రలో వచ్చే 15 రోజులు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు బుధవారం రాత్రి 8 గంటల నుంచి జనతా కర్ఫ్యూ మాదిరి ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. అన్ని అత్యవసర సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. మంగళవారం ముంబైలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కంప్లీట్ లాక్ డౌన్ ఉండదని, కానీ ఆ స్థాయిలో ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని అన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉందని అన్నారు. వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నామని వెల్లడించారు. మే 1వ తేదీ ఉదయం 7 గంటల దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు.
రెమ్‌డెసివిర్ మందుకు డిమాండ్ పెరుగుతోందని ఉద్ధవ్ చెప్పారు. తమకు మరింత ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాని మోడీని కోరామన్నారు. ఇండస్ట్రీలు ఆక్సిజన్ సరఫరా పెంచాయని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తెచ్చుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తూర్పు రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారని, కానీ అవి చాలా దూరంలో ఉన్నాయని, త్వరగా సప్లై చేసేలా ఎయిర్‌ఫోర్స్‌కు అర్డర్స్ ఇవ్వాలని కోరారు. ఆక్సిజన్ ను రోడ్డు మార్గం ద్వారా తరలించడం కంటే, ఎయిర్ రూట్ లో వేగంగా తీసుకురావచ్చన్నారు. రాష్ట్రంలో మెడిసిన్, ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఆర్మీ సాయం కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం 1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉందని, దీన్ని మెడికల్ సర్వీసెస్ కోసం మాత్రమే వినియోగిస్తున్నట్టు తెలిపారు.
వీటికి అనుమతి
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సులు నడుస్తాయి. అయితే ఎమర్జెన్సీ సర్వీసులో ఉండే వారికి మాత్రమే.. విమానాలు, రైళ్ల సర్వీసులు కొనసాగుతాయి.
ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు హెల్త్, ఫార్మా సంస్థలు, ట్రాన్స్పోర్టర్స్, వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్, బ్యాంకులు, మీడియా, ఈ-కామర్స్, పెట్రోల్ బంకులు లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ కు అనుమతి.
నిర్మాణ పనుల కొనసాగింపు.
వెటర్నరీ సర్వీసులు, యానిమల్ కేర్ షెల్టర్లు, పెట్ ఫుడ్ షాపులకు పర్మిషన్
నిత్యావసరాలు, కూరగాయల షాపులు, డైరీలు, బేకరీలు, ఇతర ఫుడ్ షాపులు ఓపెన్.
సరుకుల రవాణా, వాటర్ సప్లై సర్వీసులు, వ్యవసాయ పనులు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, ఎలక్ట్రిక్, గ్యాస్ సప్లై సర్వీసులకు ఓకే
ఏటీఎంలు, పోస్టల్ సర్వీసులు, డేటా సెంటర్లు
ఆటో రిక్షాలు నడుపుకోవచ్చు. డ్రైవర్‌తోపాటు ఇద్దరు ప్యాసింజర్లు మాత్రమే ఉండాలి. ట్యాక్సీ (4 వీలర్స్)లో 50 శాతం కెపాసిటీ. బస్సులను ఫుల్ సీటింగ్ కెపాసిటీతో నడుపుకోవచ్చు.
ఇవి క్లోజ్
హోటల్, రెస్టారెంట్లు మూసివేత. టేక్ అవే, హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి.
సినిమా హాళ్లు, థియేటర్లు, ఆడిటోరియాలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, జిమ్‌లు, క్రీడా సముదాయాలు, క్లబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్ క్లోజ్.
సినిమాలు, సీరియల్, యాడ్స్ షూటింగ్స్
అత్యవసర సేవలు అందించని దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూసివేత.
అన్ని ప్రార్థనా స్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు, బీచ్‌లు క్లోజ్.
బార్బర్ షాప్స్, సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లు
రెలీజియస్, సోషల్, కల్చరల్, పొలిటికల్ ఫంక్షన్లు నిర్వహించకూడదు.
